నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అది గుంటూరు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. ఇంకా మా అమ్మమ్మ, అమ్మ, మా ఇద్దరు పిన్నులు, చెల్లి, ఇంకా మా పిన్ని వాళ్ళ అబ్బాయి (తమ్ముడు) ఉన్నారు. అదేంటో ఆ టైం కి తాతయ్య కానీ, డాడ్ కానీ, బాబాయ్ వాళ్ళు కానీ, నాకు ఇంకో తమ్ముడు (ఇంకో పిన్ని వాళ్ళ అబ్బాయి వీడు అందరి కన్నా చిన్న, ఏడో తరగతి వాడు ) ఉన్నాడు వాడు కానీ ఎవరు లేరు.ఇక్కడ ఉన్న తమ్ముడి పేరు నన్ని వాడు ఇంజనీరింగ్ చడువతున్నాడు. మా తమ్ముడు ఒక్కడే పెద్ద మగాడు ఉన్నాడు. వీడు ఆరు అడుగులు ఉంటాడు (వీడి గురించి ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానో తర్వాత తెలుస్తుంది లెండి ). మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పక్కనే ఒక చెరువు ఉంటుంది. కొంచెం దగ్గరలో బీచ్ కూడా ఉంటుంది. ఆరోజు వాతావరణం అస్సలు బాగాలేదు. పొద్దున్న నుండి అంత గాలి వాన బాగా ఉంది. బయటికి వెళ్ళడానికి లేదు. అందరం ఇంట్లోనే ఉన్నాము. డాడ్ తిరుపతి వెళ్లారు. అక్కడి నుండి ఫోన్ చేసారు వాతావరణం బాలేదంట బయటికి వెళ్ళకండి అని. పిల్లలు ఇంట్లోనే ఉండండి అని జాగ్రత్తలు చెప్తున్నారు. అందరం సరే అని ఇంట్లోనే ఉన్నాము. ఇంతలో అంతా కేకలు అరుపులు వినిపిస్తున్నాయి బయట నుండి. తీరా చూస్తే మొత్తం నీళ్ళ మయం. అన్ని అలలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. మొత్తం నీళ్ళు. అందరం లేచి నించున్నాము. ఐన ఇంకా ఒక అల వస్తే నేను పూర్తిగా మునిగిపోడం ఖాయం. అందరికన్నా పొట్టి దాన్ని ఇంట్లో. మా తమ్ముడు కూడా నాకన్నా ఎత్తే. ఇంతలో ఇంకో అల రానే వచ్చింది నేను ఆల్మోస్ట్ మునిగి పోయాను. ఇంకా మా చెల్లి (మా చెల్లి కూడా నా కన్నా ఎత్తు ), మా తమ్ముడు చెరొక భుజం నాది పట్టుకొని పైకి లేపారు. కానీ ఏమి ఉపయోగం లేదు. ఇంకో అల వచ్చిందంటే వాళ్ళు కూడా మునిగి పోతారు. ఇంకా అందరు ఇలా కాదు అని డాబా పైకి ఎక్కేద్దాం అంటున్నారు. అప్పటికే మెట్లు మునిగి పోయాయి. సో ఇంకా నన్ను పైకి గోడ మీద నుండి ఎక్కించి వాళ్ళు ఎక్కి పెద్ద వాళ్ళ అందర్నీ పైకి లాగారు. కొద్ది సేపు అలలు వచినయ్యి. తర్వాత ఆగిపోయింది. డాబా మీదకి కూడా మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి. కొన్ని గంటలు అలాగే ఉన్న తరువాత నీళ్ళు నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇంకా అందరమూ కిందకి దిగి చూస్తే ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకు పోయాయి. ఏవో కొన్ని కొన్ని ఉన్నాయ్. సరే ఇంకా అందరు హ్యాపీ గా ఉన్నారు. ఎవరికీ ఏమి కాలేదు కదా అని. ఇంకా నీళ్ళు కొన్ని పల్లం వైపు వెళ్ళేవి వెళ్తూ ఉన్నాయ్. మా చెల్లి తమ్ముడు వాటితో ఆడుకుంటున్నారు. అందరు హ్యాపీ నే చెప్పాలంటే ఎవరికీ ఏమి కాలేదు ఏవో కొన్ని వస్తువులు పోయినయ్యి, కొనుక్కోవచ్చులే అని. కాని నేనే దిగులుగా ఉన్నాను అసలేంటి ఇలా ఐంది, ఎవరికన్నా ఏదన్న అయ్యి ఉంటె అమ్మో అని భయపడుతూ ఉన్నాను. అందరూ ఏమో సరే ఏమి కాలేదు కదా ఇంకా ఎందుకు అని బానే ఉన్నారు. నేనేమో డాడ్ కి ఫోన్ చేద్దాం కంగారు పడుతూ ఉంటారు అని ఫోన్ దగ్గరికి వెళ్ళాను (అదేంటో ఫోన్ కంప్యూటర్ మంచాలు మాత్రం కొట్టుకొని పోలా ). వెనక వీళ్ళు అంటూనే ఉన్నారు ఫోన్ ఏమి పనిచేస్తది ఈ సునామి కి అని నేను చూసేసరికి అది పని చెయ్యట్లేదు. సరే ఐతే నేను నా బ్లాగ్ అప్డేట్ చేస్తాను ఒక సునామి చూసా కదా అని కంప్యూటర్ వైపు వెళ్తున్నాను, ఫోన్ ఏ పని చెయ్యలేదు కంప్యూటర్ ఇంటర్నెట్ ఎలా పని చేస్తాయి అని వెనక నుండి మా బుల్లి అరుస్తూనే ఉంది, ఇంతలోకి నాకు మెలుకువ వచ్చేసింది తీరా చూస్తే న్యూయార్క్ లో నా బెడ్ రూం లో పడుకుని ఉన్నాను. ఈ కలేంటో నేను ఏంటో అనుకుంటూ లేచా.. !!!!!!!
hello manasa....neeku kala vachindhi saayantram manasa poddinna kaadu :)
ReplyDeleteand u did a great adventure yaar
hey ounu kada .. naaku gurthu ledu... hmm ithe post maaruddam chivara...
ReplyDeleteha ha ha enti manasa aa kala shock nunchi therukoleka ghajini ayipoyaava ;)
ReplyDeleteబాగుంది.
ReplyDeleteThank you David...-)
ReplyDeletenice blog and ur topic not bad try post some more
ReplyDelete:) ఇంతకీ.. కలలో కుడా.. కంప్యుటర్ .... బ్లాగ్...
ReplyDelete:) బాగుందడీ.....!! బాగా చెప్పారు.
nice and u r looking so cute
ReplyDeleteare u married